లెటర్ టు ఎడిటర్ .. లైబ్రేరియన్లను భర్తీ చేయాలి

లెటర్ టు ఎడిటర్ .. లైబ్రేరియన్లను భర్తీ చేయాలి

విజ్ఞానానికి చిరునామా అయిన గ్రంథాలయ వ్యవస్థ మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో నిర్జీవంగా ఉంది. పుస్తకాలు ఉన్నాయి.. చదివే విద్యార్థులు ఉన్నారు.. కానీ, ఆ పుస్తకానికి, విద్యార్థికి మధ్య వారధిగా నిలిచే 'లైబ్రేరియన్' మాత్రం లేరు. ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రేరియన్ పోస్టుల భర్తీ అనివార్యమని ఈ ఉత్తర్వులు స్పష్టం చేశాయి. 

తెలంగాణ సిద్ధించిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా 25,519 పాఠశాలల్లో గ్రంథాలయ వసతులు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. కానీ, గడిచిన పదేళ్లలో ఒక్కటంటే ఒక్క లైబ్రేరియన్ పోస్టు కూడా భర్తీ కాకపోవడం విద్యా వ్యవస్థలోని అతిపెద్ద వైఫల్యంగా కనిపిస్తోంది.  ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల్లో లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి, అక్కడ లైబ్రరీ పీరియడ్స్ నడుస్తున్నాయి.

 మరి, గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలు చదువుకునే జడ్పీ హైస్కూళ్ల  పరిస్థితి ఏమిటి? 'అందరికీ సమాన విద్య' అనే రాజ్యాంగ సూత్రం ఇక్కడ ఎందుకు అమలు కావడం లేదు?  ప్రస్తుతం విద్యార్థులు స్మార్ట్​ఫోన్ వ్యసనానికి,  ఆన్‌లైన్ గేమ్స్​కు బానిసలవుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను సన్మార్గంలో పెట్టే శక్తి ఒక్క పుస్త కానికే ఉంది. విద్యార్థి ఏది చదవాలో, ఏది వదిలేయాలో నేర్పే 'మెంటార్'. ఢిల్లీ, కేరళ. బీహార్ . పంజాబ్. జమ్మూ కశ్మీర్. వంటి 
రాష్ట్రాలు  లైబ్రరీలను బలోపేతం చేసి ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను తయారు చేస్తున్నాయి. మన రాష్ట్రం కూడా ఆ దిశగా అడుగులు వేయాలంటే పునాది బలంగా ఉండాలి.

-షేక్​ రహీమ్​-